Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మరోసారి పెరిగిన కరోనా మృతుల సంఖ్య

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (10:27 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,393 కేసులు, 911 మరణాలు వెలుగు చూశాయి. క్రితంరోజుతో పోల్చితే కేసుల్లో 5.4 శాతం తగ్గుదల కనిపించింది. అయితే మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. అంతకు ముందు రోజు 817 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
 
తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు 3.07 కోట్ల మందికిపైగా కరోనా సోకగా..4,05,939 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 17,90,708 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మొత్తం పరీక్షల సంఖ్య 42.7కోట్లకు చేరింది.
 
గడిచిన 24 గంటల్లో 44,459 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.98 కోట్లకు చేరాయి. రికవరీ రేటు 97.19 శాతానికి పెరిగింది. తాజాగా నమోదైన కేసుల సంఖ్య కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి.
 
ప్రస్తుతం 4.58లక్షల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.49శాతానికి తగ్గింది. నిన్న 40,23,173 మంది టీకాలు వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య..36,89,91,222.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేగేశ్న కార్తీక్‌ను పెళ్లాడిన నటి అభినయ.. ఫోటోలు వైరల్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments