Webdunia - Bharat's app for daily news and videos

Install App

జల్లికట్టు కోర్టు పరిధిలో ఉంది.. మీకు మద్దతిస్తాం.. కానీ ఆర్డినెన్స్ ఎలా సాధ్యం : మోడీ ట్వీట్

జల్లికట్టు సాహస క్రీడ తమిళ సంస్కృతిలో భభాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని రాష్ట్రంలో ఆందోళనలు ఉద్ధృతమైన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం గురువారం ఢి

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (14:11 IST)
జల్లికట్టు సాహస క్రీడ తమిళ సంస్కృతిలో భభాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని రాష్ట్రంలో ఆందోళనలు ఉద్ధృతమైన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం గురువారం ఢిల్లీలో మోడీతో భేటీ అయ్యారు. జల్లికట్టుపై సుప్రీంకోర్టు విధించిన నిషేధం తొలగించేలా ఆర్డినెన్స్‌ జారీ చేయాలని ప్రధానికి కోరారు. 
 
దీనిపై ప్రధాన మోడీ స్పందించారు. జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధించిందని... ఈ అంశం న్యాయ పరిధిలో ఉన్నందున ఏ నిర్ణయం తీసుకున్నా ఇబ్బందేనని వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్‌ ఇవ్వలేమనే సంకేతాన్ని ఇచ్చారు. పన్నీర్ సెల్వంతో భేటీ అనంతరం మోడీ ఈ విషయంపై వరుస ట్వీట్లు చేశారు.
 
''జల్లికట్టు సంస్కృతిని, దాని ప్రాముఖ్యాన్ని అభినందిస్తున్నాం.. కానీ ఈ విషయం కోర్టులో ఉంది. జల్లికట్టు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు కేంద్రం మద్దతిస్తుంది. రాష్ట్రానికి ఏ రకమైన సహాయం కావాల్సి ఉన్నా కేంద్రం అందిస్తుంది. త్వరలోనే తమిళనాడుకు కేంద్ర బృందాన్ని పంపుతున్నాం.'' అని ప్రధాని తన ట్వీట్లలో పేర్కొన్నారు.
 
అంతకుముందు.. ప్రధాని మోడీతో పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని తొలగించేలా అత్య‌వ‌స‌ర ఆదేశాలు జారీ చేయాలని ఆయ‌న మోడీని కోరారు. తొంద‌ర‌గా ఓ నిర్ణ‌యం తీసుకోకపోతే త‌మిళ‌నాడులో శాంతిభద్రల సమస్య తలెత్తే అవకాశం ఉందని పన్నీర్ సెల్వం అన్నారు. మ‌రోవైపు జ‌ల్లిక‌ట్టుకి మ‌ద్ద‌తుగా చెన్న‌ైలోని మెరీనా బీచ్ వ‌ద్ద వ‌రుస‌గా మూడోరోజు ప్ర‌జ‌లు భారీ ఎత్తున ఆందోళ‌నలు కొనసాగుతున్నాయి. 

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments