Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఒమిక్రాన్ దూకుడు - 361కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (07:31 IST)
దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. గురువారానికి దేశ వ్యాప్తంగా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 361కు చేరింది. వీటిలో ఒక్క తమిళనాడులో ఒకే రోజు ఏకంగా 33 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఒమిక్రాన్ కేసుల జాబితాలో తమిళనాడు మూడో స్థానానికి ఎగబాకింది. దీంతో కేంద్రం కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 
 
ఇప్పటికే డెల్టా వేరియంట్‌ ఓ వైపు భయపెడుతుంది. మరోవైపు, ఒమిక్రాన్ టెన్షన్ ప్రారంభమైంది. ఈ మధ్య భారత్‌లోకి ప్రవేశించిన ఈ వైరస్... క్రమక్రమంగా రాష్ట్రాలకు విస్తరిస్తుంది. గురువారం మరో 89 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 361కు చేరింది. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది.  
 
ఢిల్లీలో క్రిస్మస్, కొత్త సంవత్సర వేడుకలను రద్దు చేసింది. అలాగే, ముంబైలో రాత్రిపూట 144 సెక్షన్‌ను అమల్లోకి తెచ్చింది. గుజరాత్‌లోని 9 నగరాల్లో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. కర్నాటక రాష్ట్రంలో సామూహిక వివాహాలపై నిషేధం విధించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు 144 సెక్షన్ విధించారు. ఒమిక్రాన్ వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments