Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యం... మంచి నిర్ణయం తీసుకోండి.. శశి వర్గీయులకు ఓపీఎస్ లేఖ

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తన వైరివర్గం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గీయులకు ఓ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (16:09 IST)
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తన వైరివర్గం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గీయులకు ఓ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆయన ఈ లేఖ విడుదల చేశారు. 
 
పార్టీలో వివాదాలు తాత్కాలికమని, మనమంతా ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యేలకు ఆయన పిలుపునిచ్చారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ విడిపోతుందని ప్రత్యర్థులు చూస్తున్నారని, ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందన్నారు. 
 
అమ్మ అసంపూర్తిగా మిగిల్చిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన లేఖలో తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పనులపై దృష్టి పెట్టాలని పన్నీర్ సెల్వం సూచించారు. ఏ పార్టీ మద్దతు, సహకారం లేకుండానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

బాలీవుడ్‌‍ను లీడ్ చేస్తున్న పుష్ప-2.. ఒక్కో టిక్కెట్ ధర రూ.3 వేలా?

పాత పోస్టులపై కేసులు.. ఇక్కడ కాదు.. అమెరికాలోనూ ఇంతే.. ఆర్జీవీ

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments