Webdunia - Bharat's app for daily news and videos

Install App

శశిపై పన్నీర్ సర్జికల్ స్ట్రైక్స్.. ఎమ్మెల్యేలు ఎక్కడున్నా పట్టుకురండి.. డీజీపీకి ఆదేశాలు

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం. దూకుడు పెంచిన పన్నీర్ సెల్వం మౌన దీక్షను వీడి.. శశికళకు చుక్కలు చూపిస్తున్నారు. సీఎం పదవిన

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (13:15 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం. దూకుడు పెంచిన పన్నీర్ సెల్వం మౌన దీక్షను వీడి.. శశికళకు చుక్కలు చూపిస్తున్నారు. సీఎం పదవిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు. ఎమ్మెల్యేలను బందీలుగా చేసిన శశికళపై ఇప్పటికే సవాలు విసిరిన పన్నీర్ సెల్వం.. ఎమ్మెల్యేలను ఎక్కడున్నా పట్టుకురావాలని డీజీపీ రాజేంద్రన్‌కు ఆదేశాలు జారీచేశారు.

రాష్ట్రానికి గవర్నర్ విద్యాసాగర్ చేరుకునేందుకు కొన్ని గంటలే మిగిలి వుండటంతో.. ఎమ్మెల్యేలను పట్టుకొచ్చి తన బలాన్ని నిరూపించుకునేందుకు పన్నీర్ సెల్వం సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. 
 
మరోవైపు పన్నీర్ సెల్వంపై శశికళ సంచలన ఆరోపణలు చేశారు. పన్నీర్ సెల్వం మా ఎమ్మెల్యేలను కొంటున్నారని చెప్పారు. కాగా.. తమిళనాడులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపరిస్థితి దాగుడుమూతలు ఆడుతున్నట్లుంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తన శిబిరంలోని 130 మంది ఎమ్మెల్యేలను ఎవ్వరూ ప్రలోభ పెట్టకుండా జాగ్రత్తగా దాచేసిన సంగతి తెలిసిందే.
 
బుధవారం మధ్యాహ్నం పార్టీ సమావేశం అయిపోగానే అందరినీ లగ్జరీ బస్సుల్లో ఎక్కించి రహస్య ప్రాంతానికి తరలించారు. వీరంతా చెన్నై శివారుల్లోని కొన్ని రిసార్టుల్లో ఉన్నట్లు సమాచారం. 130 మంది ఎమ్మెల్యేలు బృందాలుగా విడిపోయి శివారుల్లోని వేర్వేరు లగ్జరీ రిసార్టుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
 
బీచ్‌ల్లో వాటర్‌ స్కీయింగ్‌లతో పాటు చక్కగా మసాజ్‌లు చేయించుకుంటూ లగ్జరీ రిసార్టుల్లో గడుపుతున్నట్లు సమాచారం. ఈస్ట్‌కోస్ట్‌ రోడ్‌లోని రిసార్ట్‌లో కొందరు ఉన్నారని, ఓ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో ఉన్నారని రకరకాలుగా చెప్తున్నారు. చెన్నైకి 80కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం సమీపంలోని రిసార్ట్‌లో కొందరు శాసనసభ్యులు ఉన్నట్లు ఓ జాతీయ మీడియా గుర్తించింది.

కాగా శశికళ వైపు ఉన్న ఎమ్మెల్యేలు మెల్లమెల్లగా పన్నీర్ వైపు జారుకుంటున్నారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి పన్నీర్‌కు బలం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments