Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీని కాపాడలేకపోతే అమ్మ ఆత్మ నన్ను క్షమించదు : శశికళపై పన్నీర్ ఫైర్

ప్రస్తుత పరిస్థితుల్లో అన్నాడీఎంకేను కాపాడలేకపోతే అమ్మ ఆత్మ తనను క్షమించదని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం ప్రకటించారు. పైగా, ఒక కుటుంబం అన్నాడీఎంకే పార్టీని నియంత్రిస్తోందని ఆయన ఆరోపి

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (15:02 IST)
ప్రస్తుత పరిస్థితుల్లో అన్నాడీఎంకేను కాపాడలేకపోతే అమ్మ ఆత్మ తనను క్షమించదని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం ప్రకటించారు. పైగా, ఒక కుటుంబం అన్నాడీఎంకే పార్టీని నియంత్రిస్తోందని ఆయన ఆరోపించారు. 
 
ప్రస్తుత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై ఆయన తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయం తెల్సిందే. ప్రారంభంలో ఆయన వెంట ఒక్క ఎమ్మెల్యే లేదా పార్టీకి చెందిన ఒక్క నేత కూడా లేరు. కానీ, మూడు రోజుల తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారైంది. పలువురు ఎమ్మెల్యేలతోపాటు అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్ ఈ.మధుసూధనన్‌ ముఖ్యమంత్రికి అండగా నిలిచారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన మధుసూద‌న్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తాను ఇప్పుడు పోరాడ‌క‌పోతే అమ్మ జ‌య‌ల‌లిత ఆత్మ త‌న‌ను ఎన్న‌టికీ క్ష‌మించ‌దన్నారు. మ‌ధుసూద‌న్‌ను కూడా శ‌శిక‌ళ బెదిరించిందని ఆయ‌న ఆరోపించారు. మ‌ధుసూద‌న్ త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డాన్ని స‌మ‌ర్థిస్తున్నాన‌ని వ్యాఖ్యానించారు. త‌మ‌ పార్టీని ర‌క్షించుకోవాల్సిన బాధ్య‌త త‌న‌కు ఉంద‌ని చెప్పారు. మధుసూదన్ చేరికతో తన బలం మరింత పెరిగిందని చెప్పారు. 
 
అమ్మ ఆసుప‌త్రిలో చేరిన 24 రోజుల త‌ర్వాత శశిక‌ళ త‌న‌తో మాట్లాడార‌ని, ఆ స‌మ‌యంలో అమ్మ కోలుకుంటున్నార‌ని చెప్పార‌ని ఆయ‌న అన్నారు. జ‌య‌ల‌లిత మృతిపై విచార‌ణ జ‌రిపించాల్సిందేన‌ని మ‌రోసారి అన్నారు. శ‌శిక‌ళ అరాచ‌కాల‌ను అడ్డుకుంటాన‌ని వ్యాఖ్యానించారు. సీఎం పదవి కోసం చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుర్చీకోసం ఎవరు డ్రామాలు ఆడుతున్నరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసన్నారు. 

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments