Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నమ్మ సీఎం అయితే జల్లికట్టు తరహా పోరాటానికి సై: విద్యార్థి సంఘాలు

తమిళనాడు సీఎం పీఠంపై కన్నేసిన శశికళకు వ్యతిరేకంగా రాష్ట్ర యువత పోరుకు సై అంటున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ శశికళశ బాధ్యతలను స్వీకరిస్తే.. మెరీనా బీచ్ వేదికగా మరో ఉద్యమం రాజుకునే అవకాశాలు లేకపోలే

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (13:51 IST)
తమిళనాడు సీఎం పీఠంపై కన్నేసిన శశికళకు వ్యతిరేకంగా రాష్ట్ర యువత పోరుకు సై అంటున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ శశికళశ బాధ్యతలను స్వీకరిస్తే.. మెరీనా బీచ్ వేదికగా మరో ఉద్యమం రాజుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
అమ్మ మరణం తర్వాత రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో శశికళపై పన్నీర్ సెల్వం సమరం ప్రకటించారు. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వంకు ఇప్పటికే సోషల్ మీడియాలో లక్షలాది మంది యువకులు మద్దతు ఇచ్చారు. కానీ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా తమిళనాడు రాష్ట్రాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని శశికళ ప్రయత్నిస్తే మెరీనా వేదికగా మరో ఉద్యమం చేపట్టాలని తమిళనాడులోని పలు విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. 
 
తమిళనాడు సాంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం ఏలా పోరాటం చేశామో అలాగే సమర్థవంతమైన సీఎం కోసం మళ్లీ పోరాటం చెయ్యడానికి సిద్ధమని వారు చెప్తున్నారు. ఇప్పటికే శశికళ సీఎం కావడాన్ని సోషల్ మీడియాలో తప్పుపడుతూ వస్తున్న యువత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా.. శశికళ కేవలం అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి కావాలని తీరికలేకుండా ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే పరిణామాలు వేరుగా ఉంటాయని తమిళనాడుకు చెందిన యువకులు, విద్యార్థులు సోషల్ మీడియాలో హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments