Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాశ్రయాల్లో నేక్డ్ స్కానర్లు.. మహిళల పరిస్థితేంటి?

తీవ్రవాదుల ముప్పును ధీటుగా ఎదుర్కొనేందుకు దేశంలోని విమానాశ్రయాల్లో నేక్డ్ స్కానర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ టెర్మినల్ వద్ద

Webdunia
బుధవారం, 18 జనవరి 2017 (11:31 IST)
తీవ్రవాదుల ముప్పును ధీటుగా ఎదుర్కొనేందుకు దేశంలోని విమానాశ్రయాల్లో నేక్డ్ స్కానర్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ టెర్మినల్ వద్ద ఈ నేక్డ్ స్కానర్‌ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. 
 
ఉగ్రవాదుల ముప్పును కనుక్కోవాలంటే తమకు ఈ విధమైన స్కానర్లు అవసరమని హైదరాబాద్‌లోని సీఐఎస్ఎఫ్, జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు చేసిన సిఫార్సు మేరకు వీటిని తయారు చేసి ఉపయోగిస్తున్నారు. అయితే, వీటి వల్ల రేడియేషన్ సోకి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడవచ్చునన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 
 
అయితే, ఇది పూర్తిగా సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో నిర్ణయమని తమకు ఎలాంటి సంబంధం లేదని ఎయిర్‌పోర్టు అధికారులు చెపుతున్నారు. యూఎస్‌ ఎయిర్‌పోర్టుల్లోని బాడీ స్కానర్లు మరీ ఎక్స్‌రే ఇమేజ్లను తీస్తాయని, అలాకాక ఢిల్లీ‌లోని స్కానర్లు కేవలం ఊహాచిత్రాల్లాంటి ఇమేజ్‌లు తీస్తాయికనుక ఆందోళన అనవసరమని అంటున్నారు. అయితే, మహిళా ప్రయాణికులు మాత్రం దీనిపై మరింత క్లారిటీ కావాలని కోరుతున్నారు. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం