Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎస్ఐఎస్‌లో చేరిన కేరళ ఎన్.ఎస్.జి కమాండో చెల్లెలు... సీఎం విజయన్‌కు తల్లి మొర!

భారత్‌లో ఉన్న భద్రతా సిబ్బందిలో ఎన్.ఎస్.జి కమాండో ఓ భాగం. అత్యంత సుశిక్షుతులైన యువ కమాండోలు ఇందులో విధులు నిర్వహిస్తుంటారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి దేశాన్ని, ప్రజ

Webdunia
సోమవారం, 11 జులై 2016 (13:33 IST)
భారత్‌లో ఉన్న భద్రతా సిబ్బందిలో ఎన్.ఎస్.జి కమాండో ఓ భాగం. అత్యంత సుశిక్షుతులైన యువ కమాండోలు ఇందులో విధులు నిర్వహిస్తుంటారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. తమ ప్రాణాలు ఫణంగా పెట్టి దేశాన్ని, ప్రజల ప్రాణాలను కాపాడుతుంటారు. అలాంటి ఎన్.ఎస్.జి కమాండో చెల్లెలు ఒకరు ప్రపంచాన్ని వణికిస్తున్న ఐసిస్ తీవ్రవాదుల్లో చేరిపోయింది. ఆమె కాదు.. ఆమె భర్త కూడా ఈ సంస్థలో చేరినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
కేరళ నుంచి మాయమైన వారిలో 24 ఏళ్ల యువతి ఉంది. ఈమె గర్భవతి. ప్రస్తుతం ఈమె సిరియాలోని ఇసిస్ సంస్థలో పని చేస్తున్నట్టు ఆమె తల్లి బిందు కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ను కలిసి వెల్లడించింది. 
 
తన బిడ్డ.. ఎంతో తెలివైందని చెప్పుకొచ్చింది. ఓ క్రిస్టియన్‌ను వివాహం చేసుకుందని, ఆపై వారిద్దరూ ముస్లిం మతం స్వీకరించారని, ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదని వాపోయింది. గత నెల 5న శ్రీలంక వెళుతున్నట్టు చెప్పిందని, ఆపై చాలా రోజులు సమాచారం లేదని తెలిపింది. 
 
ఆపై ఎక్కడి నుంచి మాట్లాడుతున్నదీ వెల్లడించకుండా, వాట్సాప్ ద్వారా ఒక్క సారి ఫోన్ చేసిందని వివరించింది. దీనిపై ఆరా తీసి తన కుమార్తె ఆచూకీ తెలుసుకోవాలని కోరింది. అలాగే, ఈమె భర్త కూడా కనిపించడం లేదని అతని తల్లిదండ్రులు కేరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం