Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వీట్లు చేస్తోంది నేనే. దెయ్యం కాదు... సుష్మా స్వరాజ్

Webdunia
ఆదివారం, 31 మార్చి 2019 (16:52 IST)
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఓ నెటిజన్‌కు ఘాటైన సమాధానం ఇచ్చారు. విదేశాల్లో ఆపదలో ఉన్న ఎంతో మంది భారతీయులను ఆమె రక్షించారు. మరికొంతమందిని స్వదేశానికి సురక్షితంగా తీసుకొచ్చారు. పైగా, విదేశాల్లో ఉన్నవారికి ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేస్తుంటారు. 
 
ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సుష్మాకు ట్వీట్‌ చేస్తూ.. 'మేడమ్‌.. మీరు మా విదేశాంగ మంత్రి అనుకున్నాం. భాజపాలో ఉన్న ఏకైక తెలివైన వ్యక్తి మీరే అనుకున్నాం. అలాంటప్పుడు ఎందుకు మీ ముందు చౌకీదార్‌ అని పెట్టుకున్నారు?' అని ప్రశ్నించారు. దీనికి సుష్మా సమాధానమిస్తూ, 'ఎందుకంటే నేను భారతీయ ప్రజల ఆసక్తులకు, విదేశాల్లో ఉంటున్న భారతీయులకు చౌకీదార్‌ (కాపలాదారు)ని కాబట్టి' అని రిప్లై ఇచ్చారు. 
 
ఆ తర్వాత సుష్మా రిప్లైకు సమిత్‌ అనే నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 'ఈ ట్వీట్లన్నీ చేస్తోంది సుష్మా స్వరాజ్‌ కాదు. ఆమె ఇస్తున్న జీతానికి పీఆర్‌ చేస్తున్న పని ఇది' అని ట్వీట్ చేశాడు. దీనికి ఆమె ఘాటైన సమాధానమిచ్చారు. 'ఎలాంటి సందేహం లేదు.. ట్వీట్లు చేస్తోంది నేనే. దెయ్యం కాదు' అని తనదైనశైలిలో సమాధానమిచ్చారు. 
 
ఈ ట్వీట్‌కు విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటికే 10 వేలమందికి పైగా నెటిజన్లు లైక్ చేయగా, అనేక వందల మంది ఈ ట్వీట్‌ను షేర్ చేశారు. ఈ ట్వీట్‌ ద్వారా తనలోని హాస్య చతురతను సుష్మా స్వరాజ్ చాటిచెప్పారని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments