Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

ఠాగూర్
సోమవారం, 23 జూన్ 2025 (16:26 IST)
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగోలో పనిచేస్తున్న ఓ ట్రైనీ పైలెట్‌ను సహోద్యోగులు కులం పేరుతో దూషించారు. ఉద్యోగం మానేసి ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో అంటూ పరుష పదజాలంతో సహ ఉద్యోగులు దూషించారు. దీంతో బాధితుడు అశోక్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఎస్టీ ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు నమోదు నమోదు చేశారు. 
 
ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ట్రైనీ పైలెట్‌గా పనిచేస్తున్న అశోక్ కుమార్‌ను ఆయన సహోద్యోగులైన తపస్ డే, మనీశ్ సహానీ, రాహుల్ పాటిల్ కులం పేరుతో దూషించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తనను చమరా, భంగీ వంటి నిమ్న పదజాలంతో దూషించారని, నువ్వు విమానం నడపడానికి అనర్హుడని, కాక్‌పిట్‌లో కూర్చోవడానికి కూడా నీకు అర్హత లేదు అని అవమానించారని అశోక్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
అంతటితో ఆగకుండా ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో.. నీ కులవృత్తి అదే కదా అంటూ తీవ్రంగా అవమానించారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు.. అంటూ ఇతరుల ముందే తనను కించపరిచారని కుమార్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తను మాసికంగా తీవ్రంగా గాయపరిచారని ఆయన వాపోయాడు. 
 
అశోక్ కుమార్ ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు నిందితులైన తపస్ డే, మనీశ్ సహానీ, రాహుల్ పాటిల్‌పై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సంబంధిత సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ కిందక కూడా కేసు నమోదు చేశారు. ఈ సంఘటన విమానయాన రంగంలో కుల వివక్ష ఉందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments