Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెగాసస్ స్పైవేర్ వివాదం.. ఎట్టకేలకు స్పందించిన కేంద్రం

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (18:24 IST)
పెగాసస్ స్పైవేర్ వివాదంపై ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. 20 రోజులకు పైగా పార్లమెంటును స్తంభింప చేస్తున్న ఈ స్పై వేర్‌ను తయారు చేసిన ఇజ్రాయెలీ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్‌తో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని రక్షణ శాఖ ప్రకటించింది. ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్‌తో రక్షణ శాఖ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ రాజ్యసభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.
 
ఇకపోతే.. పెగాసస్ తయారీదారు ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్ తాము ప్రభుత్వాలు, ప్రభుత్వ ఏజెన్సీలకు మాత్రమే నిఘా సాఫ్ట్ వేర్ అమ్మినట్లు చెప్తున్న నేపథ్యంలో విపక్షాలు మాత్రం కేంద్రాన్ని టార్గెట్ చేయడం మానడం లేదు. ఇవాళ కూడా పార్లమెంటు ఉభయసభల్ని స్తంభింపజేశాయి. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న ఈ అంశంపై ఇంతకంటే ఎక్కువ చెప్పలేమంటూ కేంద్రం చెప్తున్నా విపక్షాలు మాత్రం పట్టు వీడటం లేదు. దీంతో పార్లమెంటు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
 
వాస్తవానికి మూడు వారాలుగా సాగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పెగాసస్ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని విపక్షాలు ఇరుకునపెడుతూనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు కూడా సిద్ధం కాకపోవడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. 
 
ఇప్పటికే ప్రధాని మోదీతో పాటు లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ కూడా విపక్షాలు విలువైన ప్రజా ధనాన్ని, పార్లమెంటు కాలాన్ని వృథా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా విపక్షాలు మాత్రం పెగాసస్‌పై కేంద్రం విచారణకు ఆదేశించాల్సి్ందేనని పట్టుబడుతున్నాయి. సుప్రీంకోర్టులో ఉన్న అంశమే అయినా కేంద్రం పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments