Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగి కీలక నిర్ణయం.. జనాలు గుంపుగా కనిపించారో అంతే సంగతులు

Webdunia
శనివారం, 25 ఏప్రియల్ 2020 (15:27 IST)
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాపై పోరాటంలో భాగంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 3 వరకూ కొనసాగిస్తూనే మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 30 వరకూ జనాలు ఎక్కడా గుంపుగా కనిపించకూడదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించమని ఆయన తేల్చి చెప్పారు. 
 
కేంద్ర ప్రభుత్వం ముందే ప్రకటించినట్లు మే 3 వరకూ లాక్‌డౌన్ అమలులో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఒకవేళ దేశంలో కరోనా కేసులు తగ్గి, కేంద్రం మే 3 తర్వాత లాక్‌డౌన్‌ను ఎత్తేస్తే వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు యూపీకి అధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. అదే జరిగితే కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసిరే అవకాశాలు ఉండటంతో యోగి ఆదిత్యనాథ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య 24,506కు చేరింది. ఈ మహమ్మారి బారిన పడిన 779 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 18,668 యాక్టివ్‌ కేసులు ఉండగా, 5192 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments