Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి పండగే కాదు.. అమ్మ తిరిగొచ్చేవరకు జీవితాల్లో వెలుగులు లేవ్ : అన్నాడీఎంకే నేతలు

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో సోమవారం జరిగిన ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా సాదాసీదాగా నిర్వహించారు. అలాగే, ఈనె

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (13:01 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో సోమవారం జరిగిన ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కూడా సాదాసీదాగా నిర్వహించారు. అలాగే, ఈనెలాఖరులో జరిగే దీపావళి పండుగను కూడా జరుపుకోబోమని ప్రకటించారు. అంతేకాకుండా, అమ్మ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివచ్చేంత వరకు తమ జీవితాల్లో వెలుగులు ఉండవని అన్నాడీఎంకే నేతలు అంటున్నారు. 
 
కాగా, జయలలిత ఆరోగ్యం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నేతలు, అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే వ్యవస్థాపక దినోత్సవం చాలా సింపుల్‌గా నిర్వహించామని, టపాసులు పేల్చడం, స్వీట్లు పంచుకోవడం వంటివి చేయలేదని సీనియర్ నేతలు పేర్కొన్నారు. కనీసం బ్యానర్లు కట్టడం, డెకరేషన్ చేయడం వంటి వాటి జోలికి కూడా పోలేదని, ఈ ఏడాది దీపావళి పండగ కూడా చేసుకోమని అన్నాడీఎంకే నాయకులు ఈ సందర్భంగా చెప్పారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments