Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టిన రోజు వేడుకలు వద్దు.. ప్లీజ్: అభిమానులకు మహేష్‌బాబు విజ్ఞప్తి

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (16:35 IST)
ప్రిన్స్ మహేష్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో తన జన్మదిన వేడుకలు నిర్వహించరాదని నిర్ణయించుకున్నారు.

తన అభిమానులూ వాటికి దూరంగా వుండాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9న మహేష్‌ పుట్టిన రోజు. తాము అభిమానించే హీరో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించాలని అభిమానులు ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు. తన పుట్టినరోజు సమీపిస్తుండటంతో వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మహేష్‌ అభిమానులను కోరారు.

ఈ క్రమంలో ప్రిన్స్‌ శుక్రవారం ట్విటర్‌లో పోస్టు పెట్టారు. 'ప్రియమైన అభిమానులకు.. మీరు అందరూ నాకు తోడుగా ఉండటం నా అదృష్టం. నా పుట్టిన రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తు ఉండాలని మీరు చేస్తున్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందరిని నేను అభినందిస్తున్నాను.

ప్రస్తుతం కరోనాతో మనం అందరం చేస్తున్న ఈ యుద్దంలో సురక్షితంగా ఉండటం అనేది అన్నిటికంటే ముఖ్యం. నా పుట్టిన రోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా.. ప్రేమతో మీ మహేష్‌..' అంటూ ఫ్యాన్స్‌కు సూచించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

Vijay Antony: భద్రకాళి కొత్త పొలిటికల్ జానర్ మూవీ : విజయ్ ఆంటోనీ

వై.ఎస్. గురించి మీకు ముందే తెలుసా ! అని అడిగారు : దర్శకుడు శశికిరణ్‌ తిక్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments