Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీకి జేడీయూ షాక్... సాధ్వీని బహిష్కరించాల్సిందేనంటూ డిమాండ్

Webdunia
ఆదివారం, 19 మే 2019 (10:33 IST)
బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్ర అధికార జేడీయు తేరుకోలని షాకిచ్చింది. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆదివారం ఏడో రౌండ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో జేడీయూ సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. 
 
జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపిన నాథూరాం గాడ్సేను గొప్ప దేశభక్తుడంటూ బీజేపీ భోపాల్ లోక్‌సభ అభ్యర్థి సాధ్వీ ప్రజ్ఞా సింగ్ చేసిన వ్యాఖ్యలను జేడీయూ ఖండిస్తూనే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేసింది. 
 
పాట్నాలో ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్న బీహార్ ముఖ్యమంత్రి, జేడీయు అధినేత నితీష్‌ కుమార్‌ను ప్రజ్ఞాసింగ్ వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన స్పందిస్తూ, ఆమె (ప్రగ్యా సింగ్) వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని, అలాంటి వ్యాఖ్యలకు తమ మద్దతు ఉండదన్నారు. అయితే అది పూర్తిగా బీజేపీ అంతర్గత వ్యవహారమని, సాధ్వీపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 
 
ఇకపోతే, కాశ్మీర్‌లో 370వ అధికరణను రద్దు చేస్తామంటూ ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధానంగా ప్రస్తావించడంపై అడిగిన ఓ ప్రశ్నకు సైతం నితీష్ భిన్నంగా స్పందించారు. 370 అధికరణ తొలగింపును తాము మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments