Webdunia - Bharat's app for daily news and videos

Install App

రికార్డులకెక్కిన తెలుగింటి కోడలు..

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (08:33 IST)
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో తెలుగింటి కోడలు నిర్మాలా సీతారామన్‌కు కీలకపదవి దక్కింది. ఈమె టీడీపీ సర్కారు మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ సతీమణి. ఈ తెలుగింటి కోడలు దేశ ఆర్థిక మంత్రిగా ఆమె నియమితులయ్యారు. ఎంఏలో ఆర్థిక శాస్త్రం పూర్తిచేసిన నిర్మలా సీతారామన్.. గత మంత్రివర్గంలో దేశ రక్షణ శాఖామంత్రిగా ఉన్నారు. ఇపుడు మరింత ప్రమోషన్ ఇచ్చి.. ఆర్థికమంత్రిగా నియమించారు. దీంతో ఆమె సరికొత్త రికార్డును నెలకొల్పారు.
 
పైగా, దేశ ఆర్థిక శాఖను నిర్వహించనున్న రెండో మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈమె 1970లో ఒక యేడాది పాటు ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించారు. 
 
అదేవిధంగా అమిత్ షా ను కేంద్ర హోంమంత్రిగా నియమించగా, దేశ రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్‌ను ఎంపిక చేశారు. భారత విదేశాంగ మంత్రిగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుబ్రహ్మణ్యం జయశంకర్‌ను మోడీ ఎంపిక చేశారు. 
 
కాగా, మే 30వ తేదీ రాత్రి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయగా, ఆయన తన మంత్రివర్గంలో 24 మంది కేబినెట్ మంత్రులు, 9 మంది స్వతంత్ర సహాయ మంత్రులు, 24 మంది సహాయ మంత్రులను నియమించుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments