Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరిచిపోలేని రోజు.. 6న బాధ్యతలు స్వీకరిస్తా : నిర్మలా సీతారామన్

తన జీవితంలో సెప్టెంబర్ మూడో తేదీ మరచిపోలేని రోజని కేంద్ర రక్షణ మంత్రిగా కొత్తగా నియమితులైన నిర్మాలా సీతారామన్ అన్నారు. తనకు అప్పగించిన రక్షణ శాఖ మంత్రి పదవి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, ఈనెల 6వ తేదీన బ

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2017 (17:51 IST)
తన జీవితంలో సెప్టెంబర్ మూడో తేదీ మరచిపోలేని రోజని కేంద్ర రక్షణ మంత్రిగా కొత్తగా నియమితులైన నిర్మాలా సీతారామన్ అన్నారు. తనకు అప్పగించిన రక్షణ శాఖ మంత్రి పదవి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, ఈనెల 6వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. 
 
సహాయ మంత్రిగా ఉన్న ఆమె... పదోన్నతి పొంది ఆదివారం కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. 
 
ఈ రోజు తనకెంతో ప్రత్యేకమైనదని, తన స్పందనను మాటల్లో చెప్పలేనన్నారు. తన నుంచి ఆశించిన లక్ష్యాలను చేరుకొనేందుకు కృషిచేస్తానన్నారు. దేశంలో ఇదివరకు రక్షణ మంత్రులుగా పనిచేసినవారంతా వారి వారి పాత్రలో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మహిళలు బృందంగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని తెలిపారు. 
 
కాగా, నిర్మలా సీతారామన్‌కు రక్షణ శాఖను కేటాయించిన ప్రధాని మోడీ... పియూష్ గోయెల్‌కు రైల్వే, బొగ్గు శాఖలను కేటాయించారు. అలాగే, ధర్మేంద్ర ప్రదాన్‌కు పెట్రోలియం, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీకి మైనార్టీ సంక్షేమం, ఆర్‌.కె.సింగ్‌‌కు విద్యుత్‌ (స్వతంత్ర హోదా), ఆల్ఫోన్స్‌ కన్నన్‌ థానమ్‌కు పర్యాటక (స్వతంత్ర హోదా), ఐటీ శాఖ సహాయ మంత్రి, హర్‌దీప్‌ సింగ్‌‌కు గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి (స్వతంత్ర హోదా), సత్యపాల్ సింగ్‌కు‌ మానవవనరుల అభివృద్ధి, జలవనరులు, గజేంద్రసింగ్‌ షెకావత్‌కు వ్యవసాయం, రైతు సంక్షేమం, అశ్విని కుమార్‌ చౌబేకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, అనంతకుమార్‌ హెగ్డేకు నైపుణ్యాభివృద్ధి శాఖ, శివ ప్రతాప్‌ శుక్లాకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి, వీరేంద్రకుమార్‌‌కు మహిళా, శిశు సంక్షేమం, స్మృతి ఇరానీకి సమాచార, జౌళి శాఖ, సురేశ్‌ ప్రభుకు వాణిజ్య శాఖను కేటాయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments