Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్మలాదేవిపై మరో ఇద్దరు అమ్మాయిల ఫిర్యాదు.. అందుకే ఆ తప్పు చేసిందట?

కాలేజీలో చదివే అమ్మాయిలను మాయ మాటలు చెప్పి... విద్యార్థినులపై లైంగిక ఒత్తిడి చేసిన అరుప్పుకోట్టై దేవాంగరై ఆర్ట్స్‌ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి కేసులో పోలీసులు కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ

Webdunia
బుధవారం, 25 ఏప్రియల్ 2018 (11:57 IST)
కాలేజీలో చదివే అమ్మాయిలను మాయ మాటలు చెప్పి... విద్యార్థినులపై లైంగిక ఒత్తిడి చేసిన అరుప్పుకోట్టై దేవాంగరై ఆర్ట్స్‌ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి కేసులో పోలీసులు కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చారు. తమిళనాడులో సంచలనం సృష్టించిన ఈ కేసులో అరెస్టయిన నిర్మలా దేవి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.


విద్యార్థినులతో జరిపిన ఫోన్ సంభాషణలు వెలుగులోకి రావడంతో ఈ కేసును సీబీసీఐడి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మలా దేవిపై మరో ఇద్దరు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. 
 
ఈ వ్యవహారంలో నిర్మలాదేవికి సహకరించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్, రీసెర్చ్ స్టూడెంట్ కరుప్పు స్వామి అనే వ్యక్తిపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ప్రొఫెసర్ మురగన్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
అంతేగాకుండా నిర్మలాదేవి వద్ద పోలీసులు జరిపిన దర్యాప్తులో తన కుమార్తెకు మెడికల్ సీటును పొందేందుకు రూ.30 లక్షలు ఇచ్చి తాను మోసపోయానని వెల్లడించినట్టు తెలుస్తోంది. తాను మోసపోయిన డబ్బును ఎలాగైనా తిరిగి సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే అమ్మాయిలను ఎరవేసేందుకు ప్రయత్నించినట్టు సీబీసీఐడీ పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం