Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిని క్షమించలేం... రాష్ట్రపతి :: నిర్భయ దోషులకు త్వరలో ఉరి

Webdunia
శుక్రవారం, 17 జనవరి 2020 (14:58 IST)
నిర్భయ దోషులకు త్వరలో ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. అది ఈనెల 22వ తేదీన అమలు చేస్తారా? లేదా మరో 14 రోజుల తర్వాత అమలు చేసే అవకాశం ఉంది. ఈ ముద్దాయిల ఉరిశిక్షలపై ఇప్పటికే ఢిల్లీ పాటియాలా కోర్టు డెత్ వారెంట్లను జారీ చేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, ఈ కేసులో దోషి ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం తిరస్కరించారు. ముఖేశ్ క్షమాభిక్షను తిరస్కరించండంటూ కేంద్ర హోంశాఖ వర్గాలు శుక్రవారం ఉదయం రాష్ట్రపతికి విన్నవించాయి. దీంతో క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ సంచలన నిర్ణయంపై నిర్భయ తండ్రి స్పందించారు. 'చాలా మంచి విషయం. ఉరిశిక్ష అమలు చేయడం ఆలస్యమవుతుందనే వార్త తమ ఆశలను ఆవిరి చేసింది' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, నిర్భయ కేసులో నలుగురు దోషులను ఉరి తీస్తామని ప్రకటించిన తర్వాత ముఖేశ్ పెట్టుకున్న క్షమాభిక్ష కొంత ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. ఆయన క్షమాభిక్ష రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నందున ఆయన ఉరి శిక్షను వాయిదా వేయాలని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. అయితే, ఇపుడు రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చడంతో శిక్షను ఎపుడు అమలు చేస్తారన్నదానిపైనే సందిగ్దత నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments