Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా 41,831 కరోనా కేసులు

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (10:22 IST)
దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,831 కేసులు నమోదు కాగా.. 541 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇక రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
 
* నిన్న 17,89,472 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
 
* తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,24,351కి చేరింది.
 
* గడిచిన 24 గంటల్లో 39,258 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,08,20,521కి చేరింది.
 
* ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,10,952కు పెరిగి.. ఆ రేటు 1.30 శాతానికి చేరింది.
 
* దేశవ్యాప్తంగా టీకా కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. నిన్న ఒక్క రోజే 60,15,842 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 47,02,98,596కి చేరింది.
 
* దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా నమోదవుతున్న జిల్లాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్దేశించింది. 46 జిల్లాల్లో 10%కి పైగా, 53 జిల్లాల్లో 5-10% మధ్య పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments