Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్త వైరస్ ... 15,000 పందులు మృతి

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (23:03 IST)
ఒకవైపు కరోనా వైరస్ దేశంలో విజృంభిస్తుంటే.. మరోవైపు ఇంకో కొత్త వైరస్ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజాగా దేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మరో ఫ్లూను అధికారులు గుర్తించారు.

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌గా పిలవబడే ఈ వైరస్ వల్ల ఇప్పటికే అస్సాంలో దాదాపు 15 వేల పందులు మృత్యువాతపడ్డాయి. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఆ వైరస్ మరిన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. దీనితో ఆక్కడి ప్రభుత్వం వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేలా పందులను సామూహికంగా చంపేందుకు సిద్ధమవుతోంది.

అది కూడా కేవలం వైరస్ సోకిన వాటినే చంపాలని నిర్ణయించింది.  ఈ నేపధ్యంలోనే సుమారు పది జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్ జారీ చేసింది. అటు పందుల పెంపకం చేసే రైతులకు 144 కోట్ల రూపాయల వన్ టైమ్ ఫైనాన్షియల్ ప్యాకేజీని అందించాలని కేంద్రాన్ని కోరింది.

రాష్ట్రంలో పెరుగుతోన్న ఈ సంక్షోభం తీవ్ర ఆందోళనను కలగజేస్తోంది. రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 10 జిల్లాలకు వ్యాపించింది. దాదాపు 14,919 పందులు చనిపోయాయి. తాము ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా చెప్పారు.

ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ దేశీయ పందులకు ప్రాణాంతకం, దాదాపు 100 శాతం మరణాల రేటు ఉంటుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా వ్యాపించింది.

ఈ వ్యాధి జంతువుల నుండి జంతువులకే వ్యాపిస్తుందని.. మనుషులకు వ్యాప్తి చెందని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యాధి భారత్‌లో వ్యాపించడం తొలిసారి కాగా.. చైనా నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు అస్సాం మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments