Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ కొత్త లక్షణాలు - అప్రమత్తం

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (06:43 IST)
కరోనా వైరస్ ప్రభావం తగ్గినట్టే తగ్గి మళ్లీ సెకండ్ వేవ్ రూపంలో ప్రపంచాన్ని వణికిస్తోంది. మన దేశంలోనూ కరోనా రెండో దశ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా కరోనా వైరస్ తన రూపాన్ని మార్చుకుంటోందని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలింది. తాజాగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నావైరస్ లక్షణాలు లేని అనేక మంది వ్యక్తుల్లో మంటగా అనిపించడంలాంటి  సమస్యలు ఉన్నాయని బార్సిలోనా యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన సర్వేలో వెల్లడైంది.

కరోనా లక్షణాలు ఎలా ఉంటాయనే దానిపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. జలుబు, దగ్గు, జర్వం తలనొప్పి, రుచి లేకపోవడం, వాసన తెలియకపోవడం వంటివి కరోనా లక్షణాలుగా గుర్తించారు. తాజాగా వీటితోపాటు కరోనాకు సంబంధించి మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నట్టు బార్సిలోనా యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన సర్వేలో వెల్లడైంది.

జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళం, సుదీర్ఘకాలం ఒక పనిపై దృష్టి పెట్టలేకపోవడం వంటివి కూడా కరోనా లక్షణాల్లో భాగమే అని బార్సిలోనా యూనివర్శిటీ పరిశోధకులు తేలింది.

చాలా మంది కరోనావైరస్ బాధిుతుల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక కూడా కొన్ని వారాలు, నెలల పాటు నాడీ సమస్యలతో బాధపడుతున్నారని.. కరోనావైరస్ రోగం నిర్ధారణ అయిన నెలల తర్వాత ఊపిరితిత్తులు, గుండె దెబ్బతినడం వంటి సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడించారు. 
 
కాబట్టి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుందాం. బయటికి వెళ్లిన ప్రతిసారి ముఖానికి మాస్కు ధరించడంతోపాటు శానిటైజర్ వెంటబెట్టుకుని వెళ్లాలి. అంతేకాకుండా ఇతరులతో మాట్లాడేటప్పుడు భౌతిక దూరం పాటించాలి. మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు మంచి ఆహారాలను తీసుకోవాలి. 
 
రోగనిరోధక శక్తిని పెంచుకునే సాధారణ పద్ధతులు: 
 
* దాహం అనిపించినప్పుడల్లా గోరు వెచ్చని నీరు తాగండి
 
* ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయండి
 
* రోజువారీ వంటకాలలో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోండి 
 
* ప్రతి రోజు కనీసం 20 నిమిషాల పాటు ఎండలో ఉండండి
 
* పొడి దగ్గు ఉంటే తాజా పుదీనా ఆకులు వేడి నీటిలో వేసుకొని ఆవిరి పీల్చాలి.
 
* కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాతా గోరువెచ్చని నీటినే తాగాలి.
 
* తేలికపాటి వ్యాయామాలు, యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం లాంటివి చేయాలి. 
 
* సులువుగా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి.
 
* ధూమపానం, మద్యపానం అలవాట్లను మానుకోవాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments