Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా టూర్ ఓవర్.. ఇక మహారాష్ట్ర ప్రచారం స్టార్ట్స్!

Webdunia
బుధవారం, 1 అక్టోబరు 2014 (19:18 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగించుకున్నారు. అమెరికా టూర్ సక్సెస్ కావడంతో మహారాష్ట్ర ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోడీ బరిలోకి దిగనున్నారు. 
 
శివసేనతో దోస్తీ చెడిన నేపథ్యంలో మోడీ మేనియాను వినియోగిస్తే కానీ, ఆ రాష్ట్రంలో పార్టీ గట్టెక్కే పరిస్థితి లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నారు. దీంతో, వీలయినంత మేర మోడీని వాడుకోవాలని ఆయన నిర్ణయించారు.
 
ఇక, భారత వాణిజ్య రాజధానిగా భాసిల్లుతున్న మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో మొత్తం 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో మెజార్టీ సీట్లు ఎవరికైతే దక్కుతాయో, వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 
 
ప్రస్తుతం 2009లో జరిగిన ఎన్నికల్లో ముంబైలో 13 చోట్ల పోటీ చేసిన బీజేపీ ఐదింట విజయం సాధించింది. తాజాగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ, మోడీ చేత ప్రచారం చేయించి మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని యోచిస్తోంది. మరోవైపు శివసేన ఇతరత్రా పార్టీలు బీజేపీని ఓడించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. 

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments