Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేతాజీ డ్రైవర్ నిజాముద్ధీన్‌కు 116 సంవత్సరాలు.. ఆయన సతీమణికి 107 సంవత్సరాలు!

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (14:17 IST)
భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య పత్రాలను కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన మృతి పట్ల మిస్టరీ వీడలేదు. ఇటీవల విడుదల చేసిన ఫైళ్లలో నేతాజీ మరణానికి సంబంధించిన ఏవైనా రహస్య సమాచారం కొంతైనా దొరుకుతుందని అంతా ఊహించారు. అయితే ఆ దస్త్రాల్లో నేతాజీ మృతికి సంబంధించిన సమాచారం లేదు. 
 
నేతాజీ మృతిపై ఎన్ని అనుమానాలున్నా, నేతాజీ డ్రైవర్ కల్నల్ నిజాముద్దీన్ మాత్రం అరుదైన ఘనతను సాధించారు. నేతాజీ డ్రైవర్ కల్నల్ నిజాముద్దీన్ ఈ భూమిపై బ్రతికి ఉన్న అత్యధిక వయసుగల వ్యక్తిగా రికార్డ్ లిఖించారు. ఈ మధ్యనే 116 సంవత్సర పడిలోకి నిజాముద్దీన్ అడుగుపెట్టారు.
 
అతని ఓటర్ ఐడి, పాస్ పోర్ట్, బ్యాంకుకు సమర్పించిన ప్రూఫ్‌ల ఆధారంగా ఇప్పటికి నిజాముద్దీన్ వయసు 116 సంవత్సరాల 3 నెలలపై మాటే. నిజాముద్దీన్ 1900లో జన్మించినట్లు సమాచారం. 114 ఏళ్ల జపాన్‌కు చెందిన వ్యక్తి చనిపోవడంతో ఆ రికార్డు ఇప్పుడు నిజాముద్దీన్‌కు చేరింది. ఇక్కడ విచిత్రమేమిటంటే నిజాముద్దీన్ భార్య అజ్భున్నిసా వయసు 107 సంవత్సరాలట..!

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments