Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు వైద్యుడి మృతదేహాన్ని శ్మశానంలో పడేసివెళ్లిన ఆస్పత్రి సిబ్బంది.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (13:14 IST)
చెన్నై మహానగరంలో ఓ అమానవీయ ఘటన ఒకటి జరిగింది. కరోనా వైరస్ బారినపడి చెన్నైలోని ఓ కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన నెల్లూరుకు చెందిన ఆర్థోపెడిక్ వైద్యుడు చికిత్స ఫలించక కన్నుమూశారు. దీంతో ఆయన మృతదేహానికి ఎలాంటి అంత్యక్రియలు నిర్వహించలేదు. 
 
పైగా, నగర శివారు ప్రాంతంలో ఉన్న అంబత్తూరు శ్మశానవాటికలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అది చివరకు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి దృష్టికి చేరడంతో ఆయన ఆదేశం మేరకు రంగంలోకి దిగిన చెన్నై నగర పాలక సంస్థ పారిశుద్ధ్యం కార్మికులు మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో మరో ప్రాంతానికి తరలించారు.
 
కాగా, కరోనా వైరస్ బారినపడి చనిపోతే మృతదేహాలను కుటుంబం సభ్యులకు ఇప్పగించరాదన్న నిబంధన ఉంది. దీంతో నెల్లూరు వైద్యుడి మృతదేహాన్ని కూడా బంధువులకు ఇవ్వలేదు. అయితే, ఆస్పత్రి సిబ్బందే దాన్ని ఖననం చేయాల్సివుంది. కానీవారు అత్యం అమానవీయంగా నడుచుకున్నారు. మృతదేహాన్ని కనీసం శ్మశానవాటికలో పాతిపెట్టకుండా, ఆరుబయటే పడేసి వెళ్లిపోయారు. ఇలాంటి చర్యలపై తమిళనాడు ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అయ్యప్ప మాలతో చెర్రీ దర్గా దర్శనం.. ఉపాసన అదిరే సమాధానం.. ఏంటది?

ఏఆర్ రెహమాన్ ఆమెకు లింకుందా..? మోహిని కూడా గంటల్లోనే విడాకులు ఇచ్చేసింది?

మన బాడీకి తల ఎంత ముఖ్యమో నాకు తలా సినిమా అంతే : అమ్మ రాజశేఖర్

హిట్స్, ఫ్లాప్స్ ని ఒకేలా అలవాటు చేసుకున్నాను :శ్రద్ధా శ్రీనాథ్

నిజాయితీగా పనిచేస్తే సినీ పరిశ్రమ ఎవరికి అన్యాయం చేయదు. బోయపాటి శ్రీను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments