Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదర్శ దంపతులు.. రూ.కోట్ల ఆస్తిదానం.. కుమార్తెను కూడా...

డ‌బ్బే జీవితంగా, అదే ల‌క్ష్యంగా ఈ సమాజంలో ఎంతో మంది జీవిస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఆ దంపతులు ఆదర్శంగా నిలిచారు. తమ రూ.100 కోట్ల ఆస్తిని ఈ దంపతులు దానం చేశారు.

Webdunia
శనివారం, 16 సెప్టెంబరు 2017 (06:11 IST)
డ‌బ్బే జీవితంగా, అదే ల‌క్ష్యంగా ఈ సమాజంలో ఎంతో మంది జీవిస్తున్నారు. ఇలాంటి వారందరికీ ఆ దంపతులు ఆదర్శంగా నిలిచారు. తమ రూ.100 కోట్ల ఆస్తిని ఈ దంపతులు దానం చేశారు. అంతేకాదు, అంత‌కుమించిన త్యాగం కూడా చేశారు. త‌మ మూడేళ్ల పాప‌కు కూడా వారు దూరంగా ఉండనున్నారు. దీనికంతటికీ కారణం... వారు సన్యాసి జీవితం తీసుకోవాలని నిర్ణయించుకోవడమ. ఈ కఠిన నిర్ణయం ప్రతిఒక్కరినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తుతోంది. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నీమచ్‌గకు చెందిన సుమిత్, అనామిక అనే ఈ దంప‌తులు సూరత్‌లో ఈ నెల 23న జైన్ స‌న్యాసులుగా మార‌నున్నారు. ఇప్ప‌టికే త‌మ కుమార్తెను బంధువుల‌కు ద‌త్త‌త ఇచ్చారు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన ఆస్తిని, అల్లారు ముద్దుగా పెంచుకుంటోన్న కూతురిని వ‌దిలేసి వెళ్ల‌వ‌ద్ద‌ని వారి బంధువులు ఒత్తిడి తెచ్చిన‌ప్ప‌టికీ ఈ దంప‌తులు విన‌లేదు. భవ‌బంధాల‌ను తెంచుకుని ఆధ్యాత్మిక జీవిత‌మే లక్ష్యంగా వారు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ దంపతులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాన్ని మీరూ చూడండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments