Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాల బాలికను గర్భవతిని చేసి... పరారైన ఉపాధ్యాయుడు

బాలబాలికలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారిపోయాడు. నవీ ముంబైలో ఓ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు తన వద్ద చదివే ఓ విద్యార్థిని గర్భవతిని పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలన

Webdunia
సోమవారం, 12 డిశెంబరు 2016 (11:10 IST)
బాలబాలికలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారిపోయాడు. నవీ ముంబైలో ఓ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు తన వద్ద చదివే ఓ విద్యార్థిని గర్భవతిని పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే...
 
నవీముంబైకు చెందిన 42 ఏళ్ల ఉపాధ్యాయుడే 13 ఏళ్ల ఓ బాలికను పాఠశాల తరగతి గదికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం జరిపాడు. ఇలా రెండు సార్లు స్కూలులోనే ఏప్రిల్, ఆగస్టు నెలల్లో ఆ బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. బాలిక కడుపునొప్పిగా ఉందని తల్లికి చెప్పడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి డాక్టరుకు చూపించగా బాలిక నాలుగువారాల గర్భవతి అని తేలింది. దీంతో షాక్ తిన్న బాలిక తల్లి ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీరుల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్యాచారం జరిపిన ఉపాధ్యాయుడు కోపర్ ఖైరేన్‌లో నివాసముంటున్నడని అతనికి భార్య, ఒక కుమారుడున్నారని పోలీసులు చెప్పారు. అయితే ఈ కేసు అనంతరం ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నాడు. అతని ఫోన్ కూడా స్విచాఫ్ చేయడంతో పాటు అతనితోపాటు అతని కుటుంబసభ్యుల ఆచూకీ కూడా తెలియలేదు. 
 
దీంతో పోలీసు నివేదిక మేరకు సదరు కీచక ఉపాధ్యాయుడిని ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. కీచక ఉపాధ్యాయుడు ఢిల్లీల్లో ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపించి నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం