Webdunia - Bharat's app for daily news and videos

Install App

25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్?... కేంద్రం ఏం చెప్పిందంటే?

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2020 (23:34 IST)
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ఈ నెల 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందంటూ సోషల్ మీడియాలో హోరెత్తుతున్న వార్తలపై కేంద్రం స్పందించింది.

ఈ వార్తలను ఇప్పటికే ఖండించింది. తాజాగా ఫ్యాక్ట్ చెక్ చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీనిని తప్పుడు వార్తగా నిర్ధారించి ‘ఫేక్ న్యూస్’ అలెర్ట్‌లో పోస్టు చేసింది. ఈ నెల 25 నుంచి దేశవ్యాప్తంగా మరోమారు లాక్‌డౌన్ విధించబోతున్నారంటూ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) పేరుతో ఓ సర్క్యులర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అందులో.. ‘‘కరోనా వైరస్ మరణాల రేటు దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 25 నుంచి దేశవ్యాప్తంగా 46 రోజులపాటు కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ప్లానింగ్ కమిషన్‌తో కలిసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే, అత్యవసర వస్తువులను మాత్రం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు ఇందుకు అనుగుణంగా సిద్ధమవుతారన్న ఉద్దేశంతో ఎన్‌ఎండీఏ ముందస్తు నోటీసు జారీ చేసింది’’ అని ఈ నెల 10 తేదీన జారీ అయినట్టుగా ఉన్న సర్క్యులర్‌ పేర్కొంది. ఈ సర్క్యులర్ పూర్తిగా ఫేక్ అని, మరోమారు లాక్‌డౌన్ విధించాలంటూ ఎన్ఎండీఏ ఎలాంటి సర్క్యులర్లూ జారీ చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది.  

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments