Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో మేము ఎవరి మాటను వినం... ప్రధానమంత్రి మోదీ

పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ రేంజిలో కాంగ్రెస్ పార్టీపైన మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తెచ్చింది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందనీ, పార్టీల కోసం కా

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (13:57 IST)
పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ రేంజిలో కాంగ్రెస్ పార్టీపైన మండిపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులను తెచ్చింది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందనీ, పార్టీల కోసం కాదని అన్నారు. తాము స్వాతంత్ర్య సమరంలో పాల్గొనకపోయినా దేశం కోసమే జీవిస్తున్నామనీ, దేశకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని అన్నారు.
 
లోక్ సభ సమావేశాల్లో ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశానికి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందని చూస్తే.... కుటుంబ పాలన ఇచ్చిందని తెలుస్తుందన్నారు. బినామీ చట్టం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ చట్టాన్ని మాత్రం నోటిఫై చేయకుండా మరుగున ఎందుకు పడవేసిందో సమాధానం చెప్పాలన్నారు. తాము అధికారంలో వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని నోటిఫై చేశామన్నారు. 
 
దేశంలో అవినీతిపరులు, నల్లధనం వెనుకేసుకుంటున్నవారి దారులను ఒక్కొక్కటిగా మూసివేస్తున్నామనీ, అందులో భాగంగానే పెద్ద నోట్ల రద్దును అమలు చేశామన్నారు. మన ఆర్థిక వ్యవస్థ బలంగా వుండటమూ, దేశ ప్రజలు తమకు సహకరించడం వల్లనే ఇది సాధ్యమైందని వెల్లడించారు. దేశాభివృద్ధిని వెనుకకు లాగే సలహాలను, మాటలను తాము పట్టించుకోబోమని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పుష్ప-2' దర్శకుడు ఇంటిలో ఐటీ తనిఖీలు!

Rashmika Mandanna: రష్మికకు కాలు బెణికింది.. వీల్ ఛైర్‌‌పై నడవలేని స్థితిలో..? (video)

మహేష్ బాబు, జాన్ అబ్రహం, ప్రియాంక చోప్రా కాంబినేషన్ షురూ

హైలెస్సో హైలెస్సా అంటూ పాడుకుంటున్న నాగ చైతన్య, సాయి పల్లవి

చిలుకూర్ బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీవనశైలిలో మార్పులతో గుండెజబ్బులకు దూరం!!

మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

పాండ్స్ యూత్‌ఫుల్ మిరాకిల్ రేంజ్ లాంచ్

తర్వాతి కథనం
Show comments