Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని పదవి ఊడినా ఫర్లేదు... దేశం బాగుపడుతుంది... సన్నిహితులతో మోడీ

తాను తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల తన ప్రధానమంత్రి పదవి ఊడిపోయినా ఫర్వాలేదనీ, కానీ దేశం బాగుపడుతుందని తనను కలిసిన సన్నిహితుల వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారట.

Webdunia
గురువారం, 10 నవంబరు 2016 (11:54 IST)
తాను తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల తన ప్రధానమంత్రి పదవి ఊడిపోయినా ఫర్వాలేదనీ, కానీ దేశం బాగుపడుతుందని తనను కలిసిన సన్నిహితుల వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారట.
 
దేశంలో ప్రస్తుతం చెలామణిలో ఉన్న పెద్ద విలువైన రూ.500, రూ,1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు మోడీ మంగళవారం రాత్రి ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ రద్దు కూడా మంగళవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించారు. ఇందుకోసం ఆయన ఆరోజు జాతినుద్దేశించి ప్రసగించారు. 
 
ఈ ప్రకటన తర్వాత ప్రధాని మోడీని ఆయన సన్నిహితులు పలువురు కలిశారట. విపక్షాలతో పాటు.. స్వపక్షం నుంచి తీవ్రమైన విమర్శలు రావొచ్చని వారంతా ఆందోళన వ్యక్తం చేయగా, దీనికి ప్రధానిగా తనదైనశైలిలో స్పందించారట. 
 
"నేను తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో నా పదవి పోయినా ఫర్వాలేదు. కానీ దేశం బాగుపడుతుంది" అని బదులిచ్చారట. ఈ వివరణ తర్వాత సమయం తీసుకున్న ఆ సన్నిహితులు.. ఇపుడు ప్రధాని నిర్ణయంపై సంపూర్ణ విశ్వాసంతో పాటు.. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారట. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments