Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమోటాలపై ప్రధాని మోదీ ప్రత్యక్షం... ఎలాగ?(Video)

Webdunia
బుధవారం, 24 ఏప్రియల్ 2019 (21:22 IST)
దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో ఎవరికి వారి ప్రజలను ఆకర్షించటానికి నేతలు ప్రయాత్నిస్తుంటే... అందుకు భిన్నంగా రాజకీయ నేతలను ఆకర్షణిస్తున్నాడు ఓ రైతు. సాధారణంగా టమోటా ధర కేజి మహా అయితే యాబై రూపాయలు దాటదు... ధర పెంచి అమ్మడం అంటే అయ్యే పనికాదు... మరి ఎలా ఆలోచించి వినూత్న ఆలోచన శ్రీకారం చూట్టాడు ఓ రైతు. 
 
టమాటాను విభిన్న ఆకారాల్లో పండిస్తూ, ప్రయోగాలు చేస్తున్నారు చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం పొన్నూటి పాళ్యం రైతు శివకుమార్ రెడ్డి. ఇందుకోసం హృదయం ఆకారం, మోదీ పేరు వచ్చేలా ఫైబర్ అచ్చులు సిద్దం చేసుకున్నారు. టమాటా పిందె సమయంలోనే నెల రోజుల కిందే వాటికి అచ్చులను అమర్చారు. ఇపుడు కాయలు పెద్దవై హృదయాకారంలో కనిపిస్తున్నాయి. 
 
వాటిపై మోదీ పేరు స్పష్టంగా కనిపిస్తోంది. 20 కిలోల పెట్టెకు రూ. 350 లభిస్తోంది. ఈ విధానంలో పండించిన టమాటాలను కొని ఇటీవల తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఓ ఔత్సాహికుడు ప్రధాని మోదీకి బహూకరించారు. వాటిని చూసిన ఆయన మురిసిపోయారు. ఒక్క మోదినే కాకుండా భారతదేశం చిహ్నంతో కుడా టమోటాలు పండిస్తున్నాడు ఆ రైతు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments