Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్క దెబ్బతో మన సైన్యం సత్తా - సామర్థ్యం గురించి తెలిసి వచ్చింది : నరేంద్ర మోడీ

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‍లో ఉగ్రవాద తండాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. అయితే, ఆయన నేరుగా స్పందించక పోయినప్పటికీ.. ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చుతూ భారత

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (15:27 IST)
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‍లో ఉగ్రవాద తండాలపై భారత ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌ పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. అయితే, ఆయన నేరుగా స్పందించక పోయినప్పటికీ.. ఇజ్రాయెల్ సైన్యంతో పోల్చుతూ భారత ఆర్మీపై ప్రశంసల వర్షం కురిపించారు. 
 
హిమాచల్‌ ప్రదేశ్‌లోని మాండిలో మంగళవారం జరిగిన ఓ భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 'గతంలో ఇజ్రాయెల్‌ గురించి ఇలా మాట్లాడుకునేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ మన సైన్యం సామర్థ్యం గురించి తెలిసింది' అని వ్యాఖ్యానించారు. 
 
శత్రుదేశాల్లోని మిలిటెంట్లు లక్ష్యంగా గతంలో ఇజ్రాయెల్‌ ఆర్మీ ఇలాంటి నిర్దేశిత దాడులు చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌ వీరుల భూమి అని ప్రధాని మోడీ కీర్తించారు. రాష్ట్రంలో దాదాపు ప్రతి ఇంటి నుంచి ఒక జవాన్‌ ఉన్నాడని పేర్కొన్నారు.
 
పాకిస్థాన్‌లో సైన్యం జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ గురించి నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మన సైన్యం గురించే మాట్లాడుతున్నారనీ, ఈ విషయంలో మన జవాన్ల సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments