Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో రొమాన్స్.. అబార్షన్ కోసం యూట్యూబ్ చూసి..?

Webdunia
సోమవారం, 4 ఏప్రియల్ 2022 (15:15 IST)
వాళ్లిద్దరూ ప్రేమికులు. అలా ఓసారి బాయ్‌ఫ్రెండ్ ఇంటికి చేరారు. ప్రేమ మైకంలో వారిద్దరూ ఒకరోజు శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. అంతే టెన్షన్‌తో యూట్యూబ్‌ చూసి తనకు తానే వైద్యం చేసుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఈ ఘటన నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. నాగ్​పూర్​లోని నార్ఖేడ్​కు చెందిన యువతి.. ఆరు నెలల క్రితం తన బాయ్​ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో వారిద్దరూ శారీరకంగా కలవడంతో ఆమె గర్భం దాల్చింది. 
 
ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పగా అతడు ఏవో మందు వేసుకుంటే అబార్షన్ అవుతుందని సూచించాడు. అవి వేసుకున్నా ఫలితం లేదు. దీంతో  అబార్షన్‌ మందుల కోసం యూ ట్యూబ్‌లో సెర్చ్‌ చేసింది. మందులు కూడా వేసుకుంది. దీంతో అనారోగ్యానికి గురైంది. 
 
అనుమానం వచ్చి తల్లి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. అనంతరం వెంటనే ఆమెను వైద్యం కోసం నాగపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేసిన తర్వాత ఆమె ఆరోగ్యం మెరుగైందని వైద్యులు తెలిపారు. 
 
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలిక బాయ్​ఫ్రెండ్​ వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments