Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో సుఖసంతోషాలు కరువయ్యాయనీ.. భర్త - పిల్లలను చంపేసిన లేడీ డాక్టర్

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (23:13 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు కుటుంబాలకు కుటుంబాలే గల్లంతైపోతున్నాయి. అనేక మంది జీవితాలు ఇప్పటికే ఛిద్రమైపోయాయి. తాజాగా ఈ కరోనా వైరస్ కారణంగా జీవితంలో సుఖసంతోషాలు కరువయ్యాయని బాధపడుతూ ఓ మహిళా వైద్యురాలు తన కుటుంబ సభ్యులను చంపేసి తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెంది. డాక్టర్ సుష్మ రాణె. ఈమె భర్త ధీరజ్ (42). ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. వీరికి 11, 5 సంవత్సరాల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ధీరజ్ తల్లి (60)తో కలిసి వీరంతా కొరాడి ప్రాంతంలో నివసిస్తున్నారు. 
 
ఈ క్రమంలో నిన్న రాత్రి అందరూ నిద్రపోయారు. ఉదయం నిద్రలేచిన ధీరజ్ తల్లి బెడ్రూంలో నిద్రపోతున్న వారిని ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో అనుమానించిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. వారొచ్చి తలపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించి అక్కడి దృశ్యాన్ని చూసి విస్తుపోయారు. 
 
ధీరజ్, ఇద్దరు పిల్లలు బెడ్‌మీద విగతజీవులుగా పడి ఉండగా, వైద్యురాలు సుష్మ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. తన జీవితంలో ఆనందం కరవవడంతోనే ఈ పనికి పాల్పడినట్టు డాక్టర్ సుష్మ రాసిన సూసైడ్ నోట్‌ను ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
అలాగే, భర్త, పిల్లలను చంపేందుకు ఉపయోగించిన రెండు సిరింజిలను కూడా స్వాధీనం చేసుకున్నారు. తొలుత విషం కలిపిన ఆహారాన్ని భర్త, పిల్లలకు తినిపించిన సుష్మ, ఆపై గుర్తు తెలియని ఇంజక్షన్ ఇచ్చి వారిని హత్య చేసింది. అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments