Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేయని నేరానికి శిక్ష : తీవ్రవాదులనుకుని కాల్పులు జరిపారు.. యువతి ఛాతీలోకి దూసుకెళ్లిన బుల్లెట్‌

చేయని నేరానికి ఓ యువతి బలైంది. తీవ్రవాదులనుకుని పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఫలితంగా ఆ యువతి కుటుంబాన్ని పోషించేవారు లేకుండా పోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే... ఆదివారం పంజాబ

Webdunia
సోమవారం, 28 నవంబరు 2016 (12:38 IST)
చేయని నేరానికి ఓ యువతి బలైంది. తీవ్రవాదులనుకుని పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఫలితంగా ఆ యువతి కుటుంబాన్ని పోషించేవారు లేకుండా పోయారు. ఈ వివరాలను పరిశీలిస్తే... ఆదివారం పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలా జిల్లాలోని నభాం జైలుపై మెరుపుదాడికి తెగబడిన 14 మంది దుండగులు గాల్లోకి భయంకరంగా కాల్పులు జరిపి అందులోని ఖలిస్తాన్‌ లిబరేషన్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్మీందర్‌ సింగ్‌ అలియాస్‌ మింటూ ఇతర గ్యాంగ్‌ స్టర్లను విడిపించుకుని వెళ్ళిపోయారు. 
 
దీంతో అప్రమత్తమైన పంజాబ్ రాష్ట్ర పోలీసులు... ఆ దుండగులను పట్టుకునేందుకు రాష్ట్రమంతటా హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. సరిగ్గా పోలీసులు అప్రమత్తత ప్రకటించి తనిఖీలు ప్రారంభించిన మూడు గంటల గడిచిన సమయంలో నేహ శర్మ (24) అనే యువతి మరో నలుగురు యువతులతో ఓ కారు వేగంగా వెళుతోంది. వాస్తవానికి వారు పాటియాలలో జరిగే ఓ వివాహ కార్యక్రమంలో ఆడిపాడాల్సి ఉంది. సమయం ముంచుకొస్తుండంతో వేగంగా వెళుతున్నారు. 
 
పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేసిన ఆ కారు డ్రైవర్‌ కారు ఆపలేదు. సరిగ్గా ధార్మేరి స్టాప్‌ వద్ద కూడా అదే పరిస్థితి కనిపించడంతో అనుమానం వచ్చిన పోలీసుల్లో హెడ్‌కానిస్టేబుల్‌‌గా పనిచేస్తున్న షంషేర్ సింగ్‌ అనే కాల్పులు జరిపాడు. దీంతో ఆ బుల్లెట్‌ నేరుగా వెళ్లి నేహ శర్మ ఛాతీలోకి దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ కాల్పుల కారణంగా బైక్‌‌పై, మరో కారులో వెళుతున్న వ్యక్తులు కూడా గాయపడ్డారు. అయితే, ఆసమయంలో అంతకంటే ప్రత్యామ్నాయం లేదని, కాల్పులు జరిపిన పోలీసుపై హత్యానేరం మోపీ దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments