Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అమ్మ కూడా మరో ఇంద్రాణి.. నేను కూడా అక్రమ సంతానాన్నే : ఓ విద్యార్థి లేఖ

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (18:51 IST)
షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా చేసిన పాడుపని పసి హృదయాలను కూడా తాకింది. ఢిల్లీకి చెందిన ఓ పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థి క్లాస్ టీచర్‌కు రాసిన ఓ లేఖతో ఇది నిజమని తేలింది. తన తల్లి కూడా మరో ఇంద్రాణి ముఖర్జియేనని, తాను కూడా అక్రమ సంతానాన్నని ఆ బాలుడు తన లేఖలో వాపోయిన విషయం పాఠశాల అధ్యాపక సిబ్బందిని నిర్ఘాంతపోయేలా చేసింది. 
 
సాధారణంగా ఢిల్లీలోని పాఠశాలల్లో హోం వర్కు చేయని విద్యార్థులు.. హోం వర్క్ ఎందుకు చేయలేక పోయారో కారణాలు తెలుపుతూ క్లాస్ టీచర్‌కు లేఖ ద్వారా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఓ విద్యార్థి తాను హోం వర్క్ చేయక పోవడానికి కారణం వివరిస్తూనే.. తన తల్లి బాగోతాన్ని బయటపెట్టారు. ఈ లేఖలో... తన తల్లి కూడా ఇంద్రాణి ముఖర్జియా లాంటిదేనని, తన తల్లికి చాలా మందితో అక్రమ సంబంధాలు ఉన్నాయని, తాను కూడా అక్రమ సంతానాన్నని ఆ బాలుడు లేఖలో పేర్కొన్నాడు. 
 
దీంతో ప్రిన్సిపల్ దృష్టికి బాలుడి లేఖ విషయాన్ని టీచర్లు తీసుకెళ్లారు. అంతా విన్న ప్రిన్సిపల్ బాలుడి తల్లిదండ్రులను స్కూల్‌కి పిలిపించి మాట్లాడారు. అనంతరం బాలుడికి పాఠశాల యాజమాన్యం కౌన్సిలింగ్ ఇస్తోంది. పసి హృదయాలపై ఇంద్రాణి ముఖర్జియా వంటి వార్తలు నాటుకుంటే ప్రమాదమని వారు సూచిస్తున్నారు. వారిలోని ఆలోచనలను మార్చాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు