మా డాడీ పొలిటికల్ కెరీర్ చివరి దశలో ఉంది : సీఎం సిద్ధరామయ్య కుమారుడు

ఠాగూర్
బుధవారం, 22 అక్టోబరు 2025 (17:06 IST)
తన తండ్రి, బెంగుళూరు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ కెరీర్ చివరి దశలో ఉందని ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్య అన్నారు. బుధవారం బెళగావిలో జరిగిన ఓ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, రాజకీయాల్లో మా నాన్న చివరి దశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు ఆయనకు కావాలి. అలాంటి నాయకుడికి సిద్ధరామయ్య మార్గదర్శిగా ఉంటారు కూడా. సతీష్ ఝర్కిహోళికి ఆ లక్షణాలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నడిపించేందుకు ఆయన సరైన వ్యక్తి. పెద్ద బాధ్యతలు అందుకునేందుకు సిద్ధంగా ఉండండి అని యతీంద్ర వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. 
 
రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు తథ్యం అంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ్ల యతీంద్ర సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇపుడు కర్నాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా, సిద్ధరామయ్య తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమారు రాష్ట్ర సారథ్య బాధ్యతలు చేపడుతారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో సతీశ్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింతి. అయితే, ఈ పరిణామాలపై ఇటు కాంగ్రెస్ పార్టీ అటు సిద్ధరామయ్యగానీ స్పందించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

షాప్ ఓనర్ నన్ను చూసి విక్రమ్‌లా ఉన్నారు అన్నారు : బైసన్ హీరో ధృవ్ విక్రమ్

Rana Daggubati: మిరాయ్ సీక్వెల్ లో రానా దగ్గుబాటి కీలకం అంటున్న తేజ సజ్జా

RT76: స్పెయిన్‌లో రవితేజ తో సాంగ్ పూర్తిచేసుకున్న ఆషికా రంగనాథ్

నిర్మాతలు ఆర్టిస్టులను గౌరవించడం లేదు : హీరో నరేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments