Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదర్సాలో చదివేందుకు ఇష్టపడని చిన్నారులు.. కాళ్ళకు సంకెళ్లు వేయించిన కన్నతండ్రి... ఎక్కడ?

బెంగుళూరులో జరిగిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదర్సాలో చదువుకునేందుకు నిరాకరించిన ముగ్గురు చిన్నారుల కాళ్ళకు కన్నతండ్రే సంకెళ్లు వేశాడు.

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2016 (13:17 IST)
బెంగుళూరులో జరిగిన దారుణం ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మదర్సాలో చదువుకునేందుకు నిరాకరించిన ముగ్గురు చిన్నారుల కాళ్ళకు కన్నతండ్రే సంకెళ్లు వేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... నగరంలోని హెచ్ఎస్ఆర్‌లే అవుట్‌కు చెందిన సిరాజ్ వహాబ్‌కు ముగ్గురు కుమారులు. వారంతా 7 నుంచి పదేళ్ల వయసులోపు వారే. వారిపై గంపెడాశలు పెట్టుకున్న సిరాజ్... మదర్సాలో చదువుకోమని వారిని పురమాయించాడు. అయితే మదర్సాలో చదువుకునేందుకు ఆ ముగ్గురు బాలురు నిరాకరించారట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సిరాజ్ అక్కడికి సమీపంలోని మదర్సాకు చెందిన మౌలానాతో ఈ విషయం చెప్పాడు.
 
పిల్లలకు బుద్ధి చెప్పి మదర్సాలో చదువుకునేలా చేయాలని సిరాజ్... మౌలానాను ప్రాధేయపడ్డాడు. సిరాజ్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన మౌలానా ఆ ముగ్గురు పిల్లల కాళ్లకు ఒకే గొలుసుతో సంకెళ్లేశాడు. దీనిపై సమాచారం అందుకున్న బెంగళూరు పోలీసులు సివిల్ డ్రెస్‌లో మదర్సాకు వెళ్లి బాధిత పిల్లలతో మాట్లాడగా సిరాజ్, మౌలానా కలిసి తమకు సంకెళ్లు వేసినట్టు చెప్పారు. వెనువెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సిరాజ్, మదర్సా మౌలానాలను అదుపులోకి తీసుకుని జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు పెట్టారు. 

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments