Webdunia - Bharat's app for daily news and videos

Install App

''జై శ్రీరామ్'' చెప్పమన్నారు.. స్తంభానికి కట్టేసి చితకబాది.. చంపేశారు? (video)

Webdunia
సోమవారం, 24 జూన్ 2019 (14:00 IST)
దొంగలించేందుకు వచ్చాడని ఆరోపిస్తూ ఓ యువకుడిపై దారుణంగా దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్, హర్ష్వాన్ జిల్లాకు చెందిన ప్రజలు అన్సారీ అనే 24ఏళ్ల యువకుడిని స్తంభానికి కట్టివేసి దారుణంగా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆపై రంగంలోకి దిగిన పోలీసులు ప్రజల నుంచి ఆ యువకుడిని కాపాడారు. 
 
ఆపై ఆస్పత్రికి తరలించారు. ఇంకా అతనిపై ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కూడా చేపట్టారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 22వ తేదీ ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం అన్సారీపై దాడి చేసేటప్పుడు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో అన్సారీని జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ చెప్పాల్సిందిగా బలవంతం చేసినట్లుంది. ఈ వీడియో ఆధారంగా అన్సారీపై దాడికి పాల్పడిన వారిలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఈ ఘటనపై పోలీసులు అందించిన వివరాల మేరకు.. అన్సారీ పూణేలో పనిచేస్తుండేవాడని.. రంజాన్ కోసం స్వగ్రామానికి వచ్చాడని.. అంతేగాకుండా స్నేహితులతో కలిసి దొంగతనం చేయడం కూడా అతని అలవాటని చెప్పారు. ఇలా జార్ఖండ్‌లోకి దొంగతనం కోసం వచ్చిన అన్సారీ.. స్థానికులకు చిక్కుకున్నాడు. అలా దొరికిపోయిన యువకుడిని స్థానికులు తీవ్రంగా గాయపడేలా దాడి చేశారని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments