Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం అమ్మాయివి.. నిన్నెవరైనా వేధిస్తే పట్టించుకోం!: హౌసింగ్ సొసైటీ

Webdunia
బుధవారం, 27 మే 2015 (14:11 IST)
ముస్లిం అమ్మాయి కావడంతో నిన్నెవరైనా వేధిస్తే పట్టించుకోమని హౌసింగ్ సొసైటీ తేల్చిచెప్పింది. అయితే ఆమె మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. నువ్వు ముస్లింవైన కారణంగా నిన్నెవరైనా వేధిస్తే.. బిల్డర్, బ్రోకర్, ఫ్లాట్ ఓనర్లకు ఎవరికీ సంబంధం లేదని అగ్రిమెంట్ రాసిస్తేనే ఇల్లిస్తామని ఓ ముస్లిం ఉద్యోగినిపై వివక్ష చూపిన ఘటన ముంబైలో జరిగింది. 
 
కమ్యూనికేషన్ ప్రొఫెషన్లో ఉన్న 25 ఏళ్ల మిస్బా ఖాద్రి, మరో ఇద్దరు హిందూ మహిళా ఉద్యోగినులతో కలిసి ఉండేందుకు నిర్ణయించుకుంది. దీనికోసం ముంబై పరిధిలోని వడాలాలో ఉన్న సాంఘ్వి హైట్స్ లోని ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అద్దెకు తీసుకుంది. ఇంట్లో చేరేందుకు ఒక రోజు ముందు ముస్లింలు తమ అపార్టుమెంటులో వద్దంటూ, హౌసింగ్ సొసైటీ అభ్యంతరం చెప్పింది. 
 
మిగిలిన ఇద్దరు మహిళలు ఇచ్చిన భరోసాతో వారి షరతులకు ఒప్పుకున్న ఖాద్రి అప్పటికి ఇంట్లో చేరినా, వారం రోజుల్లో వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. మిస్బా ఖాద్రి తక్షణమే ఇంటిని ఖాళీ చేయాలనీ, లేకుంటే బయటకు గెంటేస్తామని రెంటల్ ఏజెంట్ బెదిరించాడు. ఖాద్రీతో పాటు మిగిలిన ఇద్దరు కూడా ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే, మొత్తం ఘటనపై సాంఘ్వీ హైట్స్ సూపర్ వైజర్ రాజేష్ స్పందిస్తూ, "ఆమె ఖాళీ చేసిన విషయాన్ని బ్రోకరును అడగాలని, తాము ముస్లింలను ఉండనిస్తామని" తెలిపారు.
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments