Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడిరోడ్డుపై యువతి హత్య..ఎక్కడో తెలుసా?

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:46 IST)
ఇటీవల యుపిలో దళిత యువతిపై సామూహిక అత్యాచార ఘటన మరువక ముందే హర్యానాలో మరో యువతిని నడిరోడ్డుపై కాల్చి చంపిన ఘటన జరిగింది. వరుసగా జరుగుతున్న ఇటువంటి ఘటనలు మహిళల భద్రతను సవాలు చేస్తున్నాయి. హర్యానాలో ఒక విద్యార్థినిని నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపిన ఘటన సంచలనం సృష్టించింది.

ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం 3.40 గంటలకు ఫరీదాబాద్‌లోని బాలాబ్‌ఘర్‌ కాలేజీ ఎదుట జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. కామర్స్‌ విద్యార్థిని నిఖిత తోమర్‌ పరీక్షలు రాసేందుకు కాలేజీకి వచ్చారు. అదే సమయంలో తౌసీఫ్‌, అతని స్నేహితుడు రేహన్‌లు కారుతో సహా అక్కడ వేచి ఉన్నారు. ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు.

దీంతో నిఖిత తీవ్రంగా ప్రతిఘటించడంతో.. గన్‌పాయింట్‌లో ఆమెను షూట్‌ చేశారు. ఆ వెంటనే వారిద్దరూ పరారు కావడంతో.. ఆమె రోడ్డుపై పడి ఉంది. ఈ దృశ్యాలు పక్కనే ఉన్న సిసికెమెరాలో రికార్డయ్యాయి. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయువతి మరణించింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

2018లో కూడా ఇదేవిధంగా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారని అన్నారు. తన కుమార్తెకు న్యాయం జరగాలని నిఖితా తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరో నిందితుడిని కూడా అరెస్ట్‌ చేయాలని హర్యానా పోలీసులకు లేఖరాసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments