Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురిటి బాబు కడుపులో మరో బాబు.. ఎక్కడ?

వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన వైద్య కేసు ఒకటి ముంబై ఆస్పత్రిలో నమోదైంది. అపుడే పుట్టిన బిడ్డ కడుపులో మరో పిండం ఉండటాన్ని వైద్యులు కనుగొన్నారు. ఓ మహిళ జన్మనిచ్చిన పండింటి బిడ్డ కడుపులో మరో బాబు ఉన్నాడ

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2017 (14:19 IST)
వైద్య చరిత్రలోనే అత్యంత అరుదైన వైద్య కేసు ఒకటి ముంబై ఆస్పత్రిలో నమోదైంది. అపుడే పుట్టిన బిడ్డ కడుపులో మరో పిండం ఉండటాన్ని వైద్యులు కనుగొన్నారు. ఓ మహిళ జన్మనిచ్చిన పండింటి బిడ్డ కడుపులో మరో బాబు ఉన్నాడు. అంటే పుట్టుకతోనే ఆ బాబు గర్భవతుడిగా జన్మించాడన్నమాట. ఈ వింతను చూసి ఆశ్చర్యపోవడం వైద్యుల వంతైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ముంబై బిర్లా ఆసుపత్రిలో ముంబ్రా ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల యువతి ఇటీవల ప్రసవించింది. ఈమెకు సంపూర్ణ ఆరోగ్యంతో పండంటి బాబు జన్మించాడు. రొటీన్గా అతన్ని స్కాన్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయే విషయాన్ని కనుగొన్నారు. అతని కడుపులో మరో బాబు ఉన్నట్టు గుర్తించారు. 
 
7 సెంటీమీటర్ల పొడవుతో, తల, కాళ్లు, చేతులు అభివృద్ధి చెందిన స్థితిలో మరో చిన్నారి పిండాన్ని కనుగొన్నారు. బిడ్డ పుట్టిన తొమ్మిదో రోజున విషయం తెలుసుకున్న వైద్యులు, విజయవంతంగా శస్త్రచికిత్సను చేసి ఆ పిండాన్ని బయటకు తీశారు. 
 
ప్రస్తుతం ఆ బిడ్డ, తల్లి ఆరోగ్యంగానే ఉన్నారని, చిన్నారి గర్భవతుడి కడుపు నుంచి 150 గ్రాముల బరువున్న పిండాన్ని వెలికితీశామని తెలిపారు. ఇది అత్యంత అరుదైన కేసని తెలిపారు. ఈ తరహా కేసులో ప్రపంచ వ్యాప్తంగా మహా అయితే ఓ 200 కేసులు ఉంటాయని వైద్యులు చెపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments