Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్శిటీ వాష్‌లో బట్టలూడదీసి విద్యార్థిని వేధించిన అగంతకుడు...

ముంబై విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని వాష్ రూమ్‌లో ఓ విద్యార్థినిని గుర్తు తెలియని అగంతకుడు ఒకడు లైంగికంగా వేధించాడు. వాష్‌ రూమ్‌కు వెళ్ళిన ఆ విద్యార్థినితో దుస్తులు విప్పించి వేధించాడు.

Webdunia
శుక్రవారం, 10 ఆగస్టు 2018 (09:00 IST)
ముంబై విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని వాష్ రూమ్‌లో ఓ విద్యార్థినిని గుర్తు తెలియని అగంతకుడు ఒకడు లైంగికంగా వేధించాడు. వాష్‌ రూమ్‌కు వెళ్ళిన ఆ విద్యార్థినితో దుస్తులు విప్పించి వేధించాడు. అయితే, ఆ అగంతకుడు ఆ విద్యార్థినిపై ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడలేదు. దీనిపై బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేస్తున్నారు.
 
ముంబై యూనివర్శిటీలోని కలీనా క్యాంపస్ వాష్ రూంలో గుర్తు తెలియని ఓ ఆగంతకుడు చొరబడ్డాడు. ఈ విషయం తెలియని ఓ విద్యార్థిని వాష్ రూమ్‌లోకి వెళ్లింది. ఆ వెంటనే తలపు వేసిన అగంతకుడు ఆమెను వేధించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయాడు. 
 
పట్టపగలే యూనివర్శిటీ ఆవరణలోని వాష్ రూంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది. 150 ఏళ్ల యూనివర్శిటీలో విద్యార్థినులకు రక్షణ కొరవడిందని విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడిని గుర్తించ లేక పోయామని వర్శిటీ రిజిస్ట్రార్ దినేష్ కాంబ్లే చెప్పారు. నిందితుడిని గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ పేర్కొన్నారు. దీనిపై రిజిస్ట్రార్ విచారణకు ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం