Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదిత్య ఠాక్రే?

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (10:26 IST)
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆదిత్య ఠాక్రే నియమితులయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు శివసేన యువజన విభాగం నాయకుడు రాహుల్ ఎన్ కనాల్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో బీజేపీతో కలిసి శివసేన యువ నాయకుడు ఆదిత్యథాక్రే ముంబైలోని శివాజీ పార్కులో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని ఆయన ట్వీట్ చేశారు. 
 
దేవుడి ఆశీస్సులతో సీఎంగా ఆదిత్య ఠాక్రే బాధ్యతలు స్వీకరించనున్నారంటూ చేసిన ట్వీట్‌లో 'గాడ్ ఈజ్ గ్రేట్, జై హింద్, జై మహారాష్ట్ర' అంటూ రాహుల్ ట్వీట్‌లో పేర్కొన్నారు. జూనియర్ ఠాక్రే ఫోటో పెట్టి, 'ఒక రోజు శివాజీ పార్కులో ఠాక్రే మనవుడు దేవుడి పేరిట ప్రమాణస్వీకారం చేస్తారు' అని మరాఠీలో ట్వీట్ చేశారు. 
 
29 ఏళ్ల ఆదిత్య ఠాక్రే ముంబైలోని వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అయిన ఎన్సీపీకి చెందిన సురేష్ మానీపై 67 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఠాక్రే కుటుంబం నుంచి మొట్టమొదటిసారి ఎన్నికైన ఆదిత్య ఠాక్రే కాబోయే సీఎం అంటూ పోస్టర్లు వేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments