Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుపై ముందు ఒకరు వెనుక ఒకరు.. ఇద్దరు యువతులతో సాహసం.. కటకటాలపాలు

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (12:11 IST)
దేశ వాణిజ్య రాజధాని ముంబై రహదారులపై ఇద్దరు అమ్మాయిలను ఎక్కించుకుని సాహసం చేసిన ఓ యువకుడిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ముంబై బంద్ర కుర్ల కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు తన బైకుపై ముందు ఒక యువతి, వెనుక ఒక యువతిని కూర్చోబెట్టుకుని ముందు టైర్‌ను గాల్లోకి లేపి బైకును వేగంగా డ్రైవ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను 1.80 లక్షల మంది చూశారు. ఇలాంటి సాహసం చేసిన బైక్ రైడర్, అతనితో ఉన్న ఇద్దరు యువతులకు మాత్రమే కాకుండా, ఇతర వాహనదారులకు కూడా అత్యంత ప్రమాదకరం కావడంతో పోలీసులు దీన్ని అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించారు. సదరు వాహనదారుడిని గుర్తించారు. అతని పేరు ఫయాజ్ ఖాద్రీగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. 
 
ఈ వీడియో వైరల్ కావడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఓ ట్వీట్ చేశారు. బంద్ర కుర్ల కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నోదైంది. విచారణ మొదలైంది. నిందితుడిని గురించి సమాచారం తెలిస్తే షేర్ చేయండి అంటూ ట్వీట్ చేశారు. చట్ట ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మోటార్ బైకుపే విన్యాసాలు చేయకూడదు. అది కూడా హెల్మెట్ లేకుండా, ఒకే బైకుపై ముగ్గురు కలిసి ఈతరహా ప్రమాదకర ఫీట్లు చేయడం వారితోపాటు ఆ మార్గంలో ప్రయాణించే ఇతర వాహనదారులకు కూడా ప్రమాదకరం. అందుకే దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

ఈ పదార్థాలు తింటే టైప్ 2 డయాబెటిస్ వ్యాధిని అదుపు చేయవచ్చు, ఏంటవి?

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

తర్వాతి కథనం
Show comments