Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపుతో వున్న వదినను 16సార్లు కత్తితో పొడిచి చంపిన మరిది..

అన్నయ్యను తమ కుటుంబం నుంచి విడదీసిందనే కోపంతోనే ఏమో కానీ వదినను మరిది దారుణంగా హత్య చేసిన ఘటన దేశ వాణిజ్య నగరం ముంబైలో చోటుచేసుకుంది. తల్లికి సమానంగా భావించే వదిన కడుపుతో వున్న విషయాన్ని కూడా లెక్కచేయ

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2017 (14:57 IST)
అన్నయ్యను తమ కుటుంబం నుంచి విడదీసిందనే కోపంతోనే ఏమో కానీ వదినను మరిది దారుణంగా హత్య చేసిన ఘటన దేశ వాణిజ్య నగరం ముంబైలో చోటుచేసుకుంది. తల్లికి సమానంగా భావించే వదిన కడుపుతో వున్న విషయాన్ని కూడా లెక్కచేయకుండా 16 సార్లు కత్తితో పొడిచి ఆ కిరాతకుడు హతమార్చాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైలోని నాలాసోపొర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాకీ ప్రాంతంలో ఉన్న నసీమా అపార్ట్‌మెంట్‌లో నిఖిత్ షేక్ అనే మహిళ త‌న భ‌ర్త‌తో క‌లిసి నివాసం ఉంటోంది. అత్తారింటివారితో ఏర్పడిన మనస్పర్ధల కారణంగా భర్తతో వేరే కాపురం పెట్టింది. ఆమె భర్త మహ్మద్ ముంబైలోని ఓలా కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిఖిత్ షేక్ నాలుగు నెలల గర్భిణి. 
 
ఈ నేపథ్యంలో మహ్మద్ ఇంట్లో లేని సమయం చూసుకుని ఆమె మ‌రిది స‌ల్మాన్ షేక్ ఇంటికి వ‌చ్చాడు. ఆ స‌మ‌యంలో నిఖిత్.. త‌న స్నేహితురాలు నూర్ ప‌ర్వీన్‌తో క‌లిసి భోజనం చేస్తోంది. ఉన్నట్టుండి ఇంట్లోకి వచ్చిన సల్మాన్ షేక్ ఆమెతో వాదులాటకు దిగాడు. పర్వీన్ అతనికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తోంది. అయినా వదినపై ఆగ్రహాన్ని ఏమాత్రం తగ్గించుకోని సల్మాన్ షేక్ అక్కడే వున్న కత్తితో దాడికి దిగాడు. 
 
ఇలా వదినపై 16 సార్లు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నిఖిత్ షేక్ తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ స‌మాచారం తెలిసిన వెంట‌నే నిఖిత్ షేక్ సోద‌రుడు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నాడు. నాలాసోపొర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. పరారీలో ఉన్న సల్మాన్ షేక్ కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments