ముంబై: పెట్రోల్ పోసి నిప్పెట్టిన ప్రియుడు.. గట్టిగా హత్తుకున్న ప్రియురాలు.. చివరికి ఏమైందంటే?

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (12:46 IST)
ముంబైలో తనను హతమార్చాలని ప్లాన్ చేసిన ప్రియుడి ప్రాణాలు తీసింది. ప్రియురాలికి నిప్పంటించిన ప్రియుడికి షాక్ తప్పలేదు. నిప్పుకు ఆహుతి అవుతూనే ఆ ప్రియురాలు.. ప్రియుడిని గట్టిగా హత్తుకుంది. అంతే అతడు కూడా మంటల్లో చిక్కుకున్నాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. 30 ఏళ్ల వ్యక్తి తన ప్రేయసిని నిప్పంటించి చంపడానికి ప్రయత్నించాడు. 
 
అలా ఆ మహిళ తనకు నిప్పంటుకున్నా.. అకస్మాత్తుగా ప్రియుడి వైపుకు వెళ్లి, అతనిని గట్టిగా పట్టుకుంది, ఇది అతని మరణానికి దారితీసింది. ఈ సంఘటనలో 80 శాతం తీవ్రగాయాలకు గురైన మహిళ ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ముంబై గాంధీ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.  బాధితురాలికి నిప్పించిన ప్రియుడు అలా నిప్పుకే ఆహుతి కావడం స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు ఇంటి తలుపు వద్ద నిల్చుని.. సహాయం కోసం అరిచిన అరుపులు భయానకాన్ని సృష్టించాయి.
 
మరణించిన విజయ్ ఖంబే అనే వ్యక్తి గత రెండున్నరేళ్లుగా బాధితురాలితో సంబంధం కలిగివున్నాడు. ఇంకా ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆమె తల్లిదండ్రులకు వివాహ ప్రతిపాదన పంపాడు. కాని వారు దానిని తిరస్కరించారు. తరువాత, బాధితురాలు కూడా అతనిని వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. ఎందుకంటే బాధితురాలికి తన ప్రియుడు మద్యపానానికి వ్యసనం కావడం ఇష్టం లేదు. 
 
దీంతో ఆవేశానికి గురైన విజయ్.. ప్రియురాలు ఇంట్లో ఒంటరిగా ఉందనే విషయాన్ని సద్వినియోగం చేసుకొని ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఆమె మంటల్లో చిక్కుకుని సహాయం కోసం అరుస్తూ ఉండగా, నిందితుడు తలుపు వద్ద నిల్చుని చూస్తూ ఉన్నాడు. దీంతో బాధితురాలు తలుపు వైపు పరుగెత్తి, అతన్ని పట్టుకుని అతనిని గట్టిగా పట్టుకుంది.
 
నిందితుడు తనను కాపాడుకోవడానికి తన వంతు ప్రయత్నం చేశాడని.. ఇరుగుపొరుగు వారి సాయంతో మంటలు ఆర్పినా.. ప్రయోజనం లేకపోయిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇద్దరినీ సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఖంబే 90 శాతం కాలిన గాయాలతో జెజె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై బాధితుడి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas : ప్రభాస్ పుట్టినరోజున చిత్రం గా పద్మవ్యూహాన్ని జయించిన పార్ధుడు పోస్టర్ రిలీజ్

Shobhita : ప్రేమ, వెలుగు కలిసి ఉండటం అంటే దీపావళే అంటున్న చైతు, శోభిత

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments