Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాట్‌ఫాంపై దిగగానే మహిళ బుగ్గపై ముద్దు... ఏడాది జైలు, రూ.10వేల జరిమానా

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (17:12 IST)
మహిళలపై అకృత్యాలు రోజు రోజుకీ పెరిగిపోతున్న తరుణంలో.. ఓ మహిళ బుగ్గపై ముద్దు పెట్టినందుకు నిందితుడికి ఏడాది జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ముంబై మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనపై తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. 2015, ఆగస్టు 26న బాధిత మహిళ తన స్నేహిడితో కలిసి గోవాండి నుంచి లోకల్ ట్రైన్‌లో సీఎస్‌ఎంటీ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ప్లాట్‌ఫాంపై దిగగానే కిరణ్ హోనోవర్(37) ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. బలవంతంగా తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని బాధితురాలు పేర్కొంది.
 
ఈ ఘటన అనంతరం బాధితురాలు సీఎస్‌ఎంటీ రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు నిందితుడిపై సెక్షన్ 354, 354 (ఎ) (1) కింద కేసు నమోదు చేశారు. దాదాపు ఏడేళ్లుగా ఈ కేసు కోర్టులో ఉంది. సంబంధిత సాక్షులందరినీ విచారించిన అనంతరం ఫోర్ట్ కోర్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వీఎస్పీ కేదార్ నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష పదివేల రూపాయల జరిమానా విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments