Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజాన్ రోజున... రెండేళ్ల కొడుకును రన్నింగ్ ట్రైన్ నుంచి విసిరేసిన తండ్రి!

ఆ కుటుంబమంతా రంజాన్ వేడుకల్లో నిమగ్నమైవుండగా ఆ తండ్రి మాత్రం అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తన రెండేళ్ళ కుమారుడిని వేగంగా దూసుకెళుతున్న రైలులో నుంచి కిందికి విసిరేశాడు.

Webdunia
శుక్రవారం, 8 జులై 2016 (14:45 IST)
ఆ కుటుంబమంతా రంజాన్ వేడుకల్లో నిమగ్నమైవుండగా ఆ తండ్రి మాత్రం అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. తన రెండేళ్ళ కుమారుడిని వేగంగా దూసుకెళుతున్న రైలులో నుంచి కిందికి విసిరేశాడు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే.. 
 
సమీనా ఖాన్, ఖాదిర్ ఖాన్ అనే దంపతులకు రెండేళ్ళ కైఫ్ ఖాన్ అనే బాలుడు ఉన్నాడు. వీరంతా రంజాన్ సందర్భంగా వేడుకల్లో పాల్గొనేందుకు ముంబైలోని బంధువుల ఇంటికొచ్చారు. అయితే, బుధవారం కైఫ్ ఖాన్ ఉన్నట్టుండి కనిపించలేదు. దీంతో కంగారులో సమీనా తన భర్త ఖాదిర్‌కు ఫోన్ చేయగా, ఫోన్ లిప్ట్ చేయలేదు. ఒక వైపు బాబు కనిపించక పోవడం, మరోవైపు భర్త ఫోన్ లిఫ్టు చేయక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని కైఫ్ కోసం గాలించారు. ఇంతలో కొన్ని గంటలకే ఖాదిర్ నుంచి సమీనాకు ఫోనొచ్చింది. బైకులా రైల్వే సమీపంలో ట్రైన్‌లో వెళుతున్న తను బాబును రన్నింగ్ ట్రైన్‌లో కింద పడేసినట్లు భార్యకు స్వయంగా చెప్పడంతో ఆమె షాక్‌కు గురైంది. కైఫ్ మృతదేహాన్ని రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. తన భర్త ఎందుకిలా ప్రవర్తించాడో అర్థం కావడం లేదని సమీనా బోరున విలపిస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఖాదిర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments